మక్కల ధర ఢమాల్
బాల్కొండ: యాసంగిలో సాగు చేసిన మక్కజొన్న పంట ప్రస్తుతం చేతికి వచ్చింది. ఎంచక్కా విక్రయించి లాభాలు ఆర్జించవచ్చనుకున్న రైతులకు ఇ బ్బందులు మొదలయ్యాయి. రోజురోజుకూ మార్కెట్‌లో మక్కల ధరను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే రైతులకు.. పౌల్ట్రీపై పడిన వైరస్ ప్రభావమంటూ వ్యాపారుల నుంచి సమాధానం వస్తోంది.
తగ్గిన డిమాండ్
పౌల్ట్రీఫామ్‌లో కోళ్ల పెంపకానికి వినియోగించే దాణాలో మక్కలను అధికంగా వినియోగిస్తారు. దీంతో వ్యాపారులు ప్రతి సీజన్‌లో రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో మక్కలను కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా వైరస్ ప్రభావంతో ఫామ్‌లలో వేలాదిగా కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. దీంతో ఫారాల యజమానులు మక్కల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. ఖరీఫ్‌లో మక్కల ధర క్వింటాలుకు రూ.2500 పలికింది. ప్రస్తుతం జొన్నకు ప్రత్యామ్నాయంగా రైతులు మక్కజొన్ను అధికంగా సాగు చేశారు. మొదట క్వింటాలు మక్కలకు రూ.2300 చెల్లించిన వ్యాపారులు, తాజాగా రోజుకో రూ.100 తగ్గిస్తూ క్వింటాలుకు రూ.2100 నుంచి రూ.2200 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లపై ‘కోళ్ల వైరస్’ ప్రభావం
రోజురోజుకూ తగ్గుతున్న ధర
Comments
Please login to add a commentAdd a comment