నిజామాబాద్
ఇంటర్ పరీక్షలకు
మెనూ ప్రకారం భోజనం..
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లో u
నిజామాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు బు ధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘నిమిషం’ నిబంధన లేకున్నప్పటికీ విద్యార్థులు సమయానికి ఎగ్జామినేషన్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి వాచీ లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొత్తం 57 సెంటర్లలో పరీక్షలు కొనసాగనున్నాయి. సెంటర్లలోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవికుమార్ సూ చించారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన మొత్తం 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్ కళాశాల సెంటర్‌లో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న ఎగ్జామినేషన్ సిబ్బంది
న్యూస్‌రీల్
పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేది వీరే..
57 మంది చీఫ్ సూపరింటెండెంట్లు
57 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు
మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
ఎనిమిది మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు
ఒక హైవపర్ కమిటీ
జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ
పరీక్షలు రాయనున్న విద్యార్థులు
అసౌకర్యాల మధ్యే..
నేటి నుంచి ప్రారంభం
‘నిమిషం’ నిబంధన లేదు..
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
కమాండ్ కంట్రోల్ రూమ్‌కు
అనుసంధానం
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 36,222 మంది
ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో అసౌకర్యాలు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో వసతులలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ సెంటర్‌లో 422 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పైకప్పు రేకులు పగిలిపోయాయి. నేరుగా తరగతి గదిలోకి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి.
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్‌లో అనేక అసౌకర్యాలు ఉన్నాయి. ఈ కళాశాలలో 310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇక్కడ విద్యుత్ అందుబాటులో లేదు. తాత్కాలికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందుబాటులో లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి.
మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇక్కడ కళాశాలకు ప్రహరీ లేదు. ధర్పల్లిలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడు గదులు మాత్రమే అందుబాటులో ఉండగా 550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక్కడ ప్రహరీ లేకపోవడంతో బయటి వ్యక్తులు ఎటువైపు నుంచి వస్తారో గుర్తించలేని పరిస్థితి ఉంది.
నిజామాబాద్
నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment