ఖలీల్‌వాడి: ఎన్నికల ప్రచారంలో తన వాహన అద్దాలు పగులగొట్టిన ఇద్దరిపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ 2014 ఏప్రిల్ 23న నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలమ్మకుంటకు వెళ్లారు. ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కేతావత్ మోహన్, కేతావత్ యాదగిరి తదితరులు అడ్డుకొని కారు అద్దాలు పగులగొట్టారని బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విత్‌డ్రా కోసం మోహన్, యాదగిరిలు మాజీ ఎమ్మెల్యేను అభ్యర్థించగా బుధవారం నిజామాబాద్ నాల్గో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరికుమార్ ఎదుట లోక్ అదాలత్‌కు హాజరయ్యారు.
ఈ నెల 8న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌లో కేసును కొట్టివేయాలని కోరగా, ముద్దాయిలపై కేసును కొట్టివేస్తూ జడ్జి హరికుమార్ అవార్డును జారీ చేశారు. న్యాయవాదులు అల్గోట్ రవీందర్, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment