యోగాతో మానసిక ప్రశాంతత
తెయూ(డిచ్‌పల్లి): క్రమం తప్పకుండా యోగా చేయడంతో ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలంగాణ యూనివర్సిటీ ఉమెన్స్ సెల్ డైరెక్టర్ భ్రమరాంభిక తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్యరక్ష నేచర్‌క్యూర్ యోగా సెంటర్ థెరపిస్ట్ ఐశ్వర్య వర్సిటీలోని విద్యార్థినులు, అధ్యాపకులతో యోగాసనాలు వేయించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment