● ఒకరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామశివారులో బుధవారం రోడ్డుపై మర్రిచెట్టు కూలడంతో ఒకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మెంగారం గ్రామానికి చెందిన అన్నం సాయిలు మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు భారీ మర్రిచెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో సాయిలుకు గాయాలుకాగా, వాహనం ధ్వంసమైంది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని లింగంపేట ఆస్పత్రికి తరలించారు. మర్రి కొమ్మ రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ అధికారులు కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment