కామారెడ్డి క్రైం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్ (25) ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవాడు. అప్పుల కారణంగా కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన నాగేశ్ బయటకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment