స్త్రీనిధి వసూళ్లకు స్పెషల్ డ్రైవ్
మోర్తాడ్(బాల్కొండ): సీ్త్ర నిధి రుణాల బకాయిల వసూళ్ల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఇతర జిల్లాలతో పోల్చితే బకాయిలు అంతగా లేకపోయినా ఎన్‌పీఏ (నాన్ ఫెర్ఫార్మింగ్ అస్సెట్స్)లోకి చేరిన ఖాతాల సంఖ్య పెరిగిపోయింది. ఎన్‌పీఏలోకి రుణ ఖాతా లు చేరితే మొండి బకాయిల శాతం పెరిగిపోతుందనే ఉద్దేశంతో వసూళ్లపై దృష్టిసారించారు. ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఎంత వీలైతే అంత ఎన్‌పీఏ తగ్గించా లని అధికారులు భావిస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లకు బ్యాంకర్లు బాధ్యత వహిస్తుండ గా, సీ్త్ర నిధి రుణాల విషయంలో మాత్రం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులపైనే భారం పడింది. జిల్లా వ్యాప్తంగా ఎన్‌పీఏ ఖాతాల సంఖ్య పెరగడంతో ఐకేపీ ఉద్యోగులు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాగా, నవీపే ట్ మండలంలో రూ.1,34,61419 బకాయిలు ఉండగా, రూ.1,09,48,326 బకాయిలతో బోధన్ రెండో స్థానంలో నిలిచింది. రూ.13,05,823 బకాయిలతో చందూర్ మండలం చివరిస్థానంలో ఉంది.
రుణాల పంపిణీ ఇలా...
జిల్లాలో సీ్త్ర నిధి ద్వారా 89,203 మందికి రూ.577,01,14,043 రుణాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రూ.140,18,59,407 వసూలు కావాల్సి ఉండగా, రూ.125,43,99,055 వసూలయ్యాయి. మిగతా వాటిని కూడా వసూలు చేసి, రుణాల చెల్లింపులను గాడిలో పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
మహిళా దినోత్సవంలోపు
వసూలు చేయాలని ఆదేశం
ప్రత్యేక బృందాలు ఏర్పాటు
ఎన్‌పీఏ ఉండొద్దని అధికారుల యోచన
బకాయిలు ఉండొద్దు
సీ్త్ర నిధి రుణాల వసూళ్లను లక్ష్యానికి అనుగుణంగా సాగించాలి. బకాయిలు ఎప్పటికప్పుడు వసూలు చేయడంతో ఎన్‌పీఏ ఉండదు. కొత్తవారికి సీ్త్ర నిధి రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశాం.
– సాయాగౌడ్, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment