అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
సుభాష్‌నగర్: జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డు కోవడాన్ని నిరసిస్తూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఆర్మూర్, బాల్కొండ, నిజామామాబాద్ రూరల్ ని యోజకవర్గాలకు విద్యాపరంగా ప్రయోజనం కలిగే లా జవహర్ నవోదయ విద్యాలయానికి జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ శివారులో భూమి కేటాయించాలని కలెక్టర్‌ను కోరారని తెలిపారు. కానీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కలిగోట్‌లో కాకుండా బోధన్ లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాల భూమిని ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి చెందిన స్థలంలో నవోదయ ఏర్పాటును రిజెక్ట్ చేసిందని గుర్తుచేశారు. రూరల్ నియోజకవర్గానికి మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాన్ని బోధన్‌కు తరలించుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, గంగోనే గంగాధర్, హరీశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మెట్టు విజయ్, ఆమంద్ విజయ్ కృష్ణ, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
దినేశ్ పటేల్ కులాచారి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
దిష్టిబొమ్మ దహనం
Comments
Please login to add a commentAdd a comment