బయోటెక్నాలజీతో బహుముఖ ప్రయోజనాలు
తెయూ(డిచ్‌పల్లి): బయోటెక్నాలజీ పరిశోధనలతో వివిధ రంగాల్లో బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు తెలిపారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టి, పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి, వైద్య రంగంలో వ్యాధుల నివారణకు ఈ శాస్త్రం కృషి చేస్తోందన్నారు. తెయూ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం బయోటెక్నాలజికల్ ప్రయోగాల ప్రదర్శనపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బయోటెక్నాలజీ.. నూతనంగా ఆవిష్కరించిన ఆధునిక శాస్త్రమన్నారు. కొవిడ్ మహమ్మారిలాంటి ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు భారత్ బయోటెక్నాలజీ సంస్థ వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బయోటెక్నాలజీ పరిశోధనలు కీలకమని వివరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో మనదేశం వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల, వైస్ ప్రిన్సిపల్ ఎం.సత్యనారాయణెడ్డి, కోకన్వీనర్ కిరణ్మయి, అధ్యాపకులు మహేందర్, జవేరియా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌నకు సుమారు 350మందికి పైగా విద్యార్థులు హాజరై జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగ పద్ధతులను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment