మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ అర్బన్: సమాజానికి పెను సవాలు గా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల ని రోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టు గా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల మూలాలను అడ్డుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చని తెలిపారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలపై ఆరా తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, అటవీ, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment