పిల్లలకు ‘ఫ్రెండ్లీ’ న్యాయసేవలు
● చట్టాలు– హక్కులపై అవగాహన
కల్పిస్తోన్న న్యాయసేవాధికార సంస్థ
● సత్ప్రవర్తన పెంపొందించేందుకు కృషి
● పాఠశాలల్లో న్యాయవిజ్ఞాన
సదస్సుల నిర్వహణ
● విస్తృతంగా పర్యటిస్తున్న
పారా లీగల్ వలంటీర్లు
ఆర్మూర్: కల్లాకపటం ఎరుగని నిర్మల, సున్నిత మనస్కులు పిల్లలు. లేత వయసులోనే పిల్లలపై పరిసరాలు, పరిస్థితులు ప్రభావం చూపుతాయి. దీంతో కొంతమంది పిల్లలు ‘మాకు అన్నీ తెలుసు’ అంటూ తప్పటడుగులు వేస్తుంటారు. మరికొందరు తమకు ఎదురైన.. ఎదురవుతున్న ఆటంకాలను ఎదుర్కోలేక ఇబ్బందులకు గురవుతుంటారు. విద్యార్థుల్లో మంచి ప్రవర్తన తేవడంతోపాటు అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు తదితర వాటి నుంచి కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తోందీ నేషనల్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ.
న్యాయవిజ్ఞాన సదస్సులు
బడీడు పిల్లలకు స్నేహ పూర్వక న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్‌ను నిజామాబాద్ జిల్లాలో విస్తృతం చేసింది. అందులో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యద ర్శి, జిల్లా న్యాయమూర్తి పి.పద్మావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ప్రభుత్వ పాఠ శాలు, స్వచ్ఛంద సేవా సంస్థలను సందర్శిస్తూ న్యా యవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాల్లో సీనియర్ న్యాయవాదులతోపాటు రిటైర్డ్ ఉ ద్యోగులతోఏర్పాటు చేసిన పారా లీగల్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వి ద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలతో రూపొందించిన నివేదికను జిల్లా న్యా యమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌కు సమర్పిస్తున్నారు. నివేదికపై న్యాయమూర్తి ఆయా శాఖల ఉన్నతాధికారులకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.
గురుకులాలు, భవిత కేంద్రాల్లో..
జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలతోపాటు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాలను ప్రత్యేక బృందాలు సందర్శిస్తున్నాయి. బృందాల్లో పారా లీగల్ వలంటీర్లు ఏ.బాబాగౌడ్, సీహెచ్ విద్యాసాగర్ రావుతోపాటు న్యాయవాదులు సంధ్య, రవీందర్, ఉదయ కృష్ణ, ఉమామహేశ్, వినీల, నర్సింహ ఉన్నారు. వీరు ఇప్పటి వరకు నిజామాబాద్ నార్త్, సౌత్, ఆర్మూర్, నవీపేట్ మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీని సందర్శించి దివ్యాంగ విద్యార్థులకు అందుతున్న సేవలు, వారి హక్కులు, కావాల్సిన అవసరాలపై నివేదిక తయారు చేశారు. ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, డిచ్‌పల్లి మండలాల్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలను సందర్శించి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment