తొలి ప్రాధాన్యం ఆ గ్రామాలకే..
మోర్తాడ్(బాల్కొండ): సొంత జాగా ఉండి ఇంటిని నిర్మించుకునేవారికి ఆర్థికసాయం అందించే విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తొలి విడతలో పథకం విస్తరణ పరిమితంగానే ఉంది. గణతంత్ర దినోత్సం రోజు ఆరు పథకా ల అమలుకు ‘పైలెట్’ గ్రామాలుగా ఎంపిక చేసిన చోటే ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో నియోజకవర్గానికి ఏడాదిలో 3,500 ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం అనేకమార్లు వెల్లడించింది. పథకం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన ప్రకటనలకు, కార్యాచరణకు పూర్తి వైరుధ్యం కనిపిస్తోంది. జిల్లాలోని 31 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయగా, మొత్తం 2,300 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్ల నిర్మాణాలకు అధికారులు ముగ్గులు పోయిస్తున్నారు.
ఆశతో ఎదురుచూస్తున్న పేదలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున సాయం అందితే తమ సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఎంతోమంది ఉన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఇళ్ల నిర్మాణం ఆరంభిస్తే వచ్చే ఏడాది మరో విడత ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు అవకాశం ఉంటుంది.
ఈసారైనా కల నెరవేరేనా!
సొంత స్థలం ఉన్న వారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సా యం అందించే పథకం ఎప్పటి నుంచో కొనసాగు తోంది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్నాళ్లకే ఆ పథకానికి ఎగనామం పలికింది. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకమూ ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. కనీసం ఇప్పుడైనా ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పథకాన్ని వేగంగా అమలు చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం
‘పైలెట్’ గ్రామాల్లోనే
ముగ్గు పోయిస్తున్న అధికారులు
దశల వారీగా ఇతర గ్రామాల్లో
అనుమతులు ఇచ్చే అవకాశం
ఎంపిక చేసిన గ్రామాల్లోనే మార్కింగ్ చేస్తున్నాం
పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేయిస్తున్నాం. దశల వారీగా ఇతర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రతి ఇంటి నిర్మాణానికి నాలుగు దశల్లో రూ.5 లక్షల సాయం అందుతుంది.
– సత్యనారాయణ, ఏఈ, గృహనిర్మాణ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment