జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా జడ్జి సునీత కుంచాల
ఖలీల్‌వాడి : ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్ రుణాలు తదితర కేసులు పరిష్కరింపబడతాయని పేర్కొన్నారు. ఇరుపక్షాలు రాజీ ఉన్నప్పుడే రాజీమార్గం సులువు అవుతుందని తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉండే వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరిస్తామన్నారు. రోడ్డు ప్ర మాదంలో నష్టపరిహారం కోసం, సైబర్ క్రై మ్ సంబంధిత కేసుల్లో కూడా న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే న్యాయం జరిగే లా కృషి చేస్తామని పేర్కొన్నారు. మూడు నెలలకోసారి వచ్చే జాతీయ లోక్ అదాల త్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. సమావేశంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పద్మావతి, సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యం పెంచుకోవాలి
● డీఆర్డీవో సాయాగౌడ్
నిజామాబాద్‌అర్బన్: స్వయం సహాయక సంఘాల సభ్యులు టైలరింగ్‌లో నైపుణ్యం పెంచుకోవాలని డీఆర్డీవో సాయాగౌడ్ సూ చించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం మండల సమాఖ్యల మా స్టర్ ట్రైనర్ల శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ మహిళలకు టైలరింగ్‌లో బల్క్ కట్టింగ్, ఖాజా, బట న్ కుట్టడంలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌డీవో ర వీందర్, డీపీఎం సాయిలు, ఏపీఎం రాజేంద ర్, శిక్షకులు మాధవి, లత, పద్మ, సుజాత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment