మొదటిరోజే ఒకరు డిబార్
ధర్మారం(బి)లో ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు హాజరుకాగా, 420 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(బీ) సెంటర్‌లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకొని మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసిందన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లతోపాటు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు రవికుమార్ తెలిపారు.
పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
డిచ్‌పల్లి: ధర్మారం(బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ మాధవీలత, తహసీల్దార్ ప్రభాకర్ ఉన్నారు.
ఇంటర్ సెకండియర్ పరీక్షలకు
420 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment