విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్) : మెనూ ప్రకారం వి ద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ఆహార ప దార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు పా టించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. మెస్ హాల్, వంటగది, పాఠశాల, కళాశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని కిచెన్, డై నింగ్ హాల్, క్లాస్ రూమ్‌లు, డార్మెటరీ, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగు ణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ప్రిన్సిపల్ మాధవీలత ను అడిగి తెలుసుకున్నారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్, కా లపరిమితి ముగిసిన వాటిని వినియోగించొద్దని ని ర్వాహకులకు సూచించారు. నాసిరకం బియ్యం, ఇ తర సరుకులు వస్తే మండల అధికారులకు ఫిర్యా దు చేయాలని సూచించారు. త్వరలో జరిగే వార్షిక పరీక్షల కోసం పదో తరగతి విద్యార్థినులకు పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పా ఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చేందుకు తక్షణ మే పనులు జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట డిచ్‌పల్లి తహసీల్దార్ ప్రభాకర్ ఉన్నారు.
ఆహార పదార్థాలు కలుషితం
కాకుండా జాగ్రత్త వహించాలి
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
ధర్మారం(బీ) గురుకుల
కళాశాల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment