బైక్ సైలెన్సర్ల ధ్వంసం
● రోడ్ రోలర్‌తో తొక్కించిన
ట్రాఫిక్ పోలీసులు
ఖలీల్‌వాడి: నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు అమర్చిన భారీ శబ్దం చేసే 240 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ రెండు, మూడు నెలల నుంచి వా హన తనిఖీలు చేస్తూ సైలెన్సర్లను తొలగించి వారిపైన చర్యలకు ఆదేశించామన్నారు. ప్రత్యేక సైలెన్సర్లను అమర్చితే మెకానిక్‌లు, వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment