నేర విచారణలో ప్రతివాదులు లేదా సాక్షులుగా వివిధ కారణాలతో పిల్లలకు న్యాయసేవలు అవసరం కావొచ్చు. భౌతిక, మానసిక హింస, లైంగిక వేధింపులు లేదా ఇతర నేరాలు, హక్కుల ఉల్లంఘనల బాధితులుగా పలు కేసుల్లో పిల్లలు నిలుస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత, వైకల్యంతో సహా సమస్యలపై పలు కేసులు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పిల్లలు విజయవంతంగా వారి కుటుంబాలతోపాటు సమా జంలో పునరావాసం పొందేలా న్యాయసేవాధికార సంస్థ తనవంతు సాయాన్ని అందిస్తోంది. బాలికలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంచుతోంది. దీంతో న్యాయ వ్యవస్థపై పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment