నిజామాబాద్ ‘సాక్షి’ ఎడిషన్ కేంద్రంలో శుక్రవారం జిల్లా
న్యాయమూర్తి సునీత కుంచాల ‘గెస్ట్ ఎడిటర్’గా వ్యవహరించారు. జిల్లాలోని రిపోర్టర్లు రాసిన కథనాలను, వార్తలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి డెస్క్ బృందానికి ఇచ్చారు. అదేవిధంగా పలు రకాల సూచనలు చేశారు. ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా రావడం చాలా సంతోషం కలిగించిందన్నారు. పాఠకులకు కేవలం రూ.5 లకు ఇచ్చే పత్రికను బయటకు తీసుకొచ్చేందుకు ఎంత కష్టముంటుందో ప్రత్యక్షంగా చూడడం కొత్త అనుభవాన్నిచ్చిందన్నారు. వార్తల సేకరణ మొదలు పత్రిక పాఠకుడికి చేరేవరకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ అనేకమంది పడుతున్న శ్రమ సాధారణమైనది కాదన్నారు. ఎప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని పొందానన్నారు.
– సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment