స్ఫూర్తిదాయకం.. తెడ్డు సుమలత
ఆర్మూర్‌టౌన్ : ‘కాళ్లు లేవు ఏం చేయగలదు’ అని వెక్కిరించిన సమాజానికే సేవలందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఆర్మూర్‌కు చెందిన తెడ్డు సుమలత. చిన్న వయస్సులోనే పోలియో ప్రభావంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయినా, దాన్ని తన జీవిత ప్రయాణానికి అడ్డుగా చేసుకోలేదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి డిగ్రీ (బీఏ) పూర్తిచేసింది. 15 సంవత్సరాలుగా పురపాలక కార్యాలయంలోని ఇన్‌వార్డ్ విభాగంలో సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చేతుల సాయంతోనే నడుచుకుంటూ రోజువారీ పనులు చేసుకుంటూ స్వయంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు ఇటీవల మరణించగా, ప్రస్తుతం సోదరుడి వద్ద ఉంటోంది. ‘ఎవరూ మన సామర్థ్యాన్ని నిర్ణయించలేరు. శారీరక అడ్డంకులు మన లక్ష్యాలను ఆపలేవు. మన సంకల్పమే మార్గం చూపుతుంది’ అని చెబుతోంది తెడ్డు సుమలత.
Comments
Please login to add a commentAdd a comment