సవాళ్లు అధిగమించి..
‘వివక్షను అధిగమిస్తూ విజయాలు సాధిస్తున్నారు.. అవహేళనలు, అవమానాలను సంకల్పమనే బాణాలతో ఛేదిస్తున్నారు.. ఇంట్లో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు.’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అతివలపై నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
డొంకేశ్వర్(ఆర్మూర్): మానవాళి మనుగడకు ప్రధానమైన అడవుల సంరక్షణకు ఆడబిడ్డలు ముందుకొస్తున్నారు. పనివేళలతో సంబంధం లేకుండా రాత్రింబవళ్లు సవాల్‌తో కూడుకున్న.. కత్తిమీద సాములాంటి విధులు నిర్వర్తిస్తున్నారు. కష్టమైన సరే అటవీ శాఖలో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. పురుషులతో సమానంగా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు పాటు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది మహిళా ఉద్యోగులు ఉండగా, అత్యధికంగా 16 మంది బీట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లుగా ఇద్దరు, ఎఫ్‌ఆర్వోగా ఒకరు, సెక్షన్ ఆఫీసర్‌గా ఒకరు విధులు నిర్వరిస్తున్నారు.
అడవితల్లి రక్షణలో ఆడబిడ్డలు
ప్రకృతితో కలిసి
పనిచేస్తున్న మహిళా బీట్ ఆఫీసర్లు
Comments
Please login to add a commentAdd a comment