సీపీగా పోతరాజు సాయిచైతన్య
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయిచైతన్యను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సాయిచైతన్య బదిలీపై వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీపై నిజామాబాద్ సీపీగా వచ్చిన కల్మేశ్వర్ సింగేనవార్ గతేడాది అక్టోబర్ 23న కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అనంతరం కామారెడ్డి ఎస్పీ సింధు శర్మకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో నిజామాబాద్‌కు పూర్తిస్థాయి సీపీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కాగా, సీపీ సాయిచైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. విధి నిర్వహణలో కఠినంగా ఉంటా రనే ముద్ర ఉంది. రెండ్రోజుల్లో సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లు ఇన్ చార్జి సీపీగా పనిచేసిన సింధుశర్మ బదిలీ అయ్యారు. ఆ మెను ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్న ఎం.రాజేశ్‌చంద్రను కామారెడ్డి ఎస్పీగా నియమించింది.
నేతల ప్రమేయంతోనే లేటుగా..
జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడడంతోనే సీపీ నియామకంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు ఇరువురు పేర్లను ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చకు దారితీసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సీపీని నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి డైరెక్ట్ ఐపీఎస్, స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది.
నాలుగు నెలల తర్వాత
కొత్వాల్ నియామకం
ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ బదిలీ
కామారెడ్డి ఎస్పీగా రాజేశ్‌చంద్ర
సీపీగా పోతరాజు సాయిచైతన్య
Comments
Please login to add a commentAdd a comment