● మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సునీత కుంచాల మాట్లాడారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి మహిళలోనూ ఓపికతో పాటు శక్తి ఎంతో ఉంటుందన్నారు. శక్తిని సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలను సాధించొచ్చన్నారు. వర్కింగ్ ఉమెన్స్ చాలెంజింగ్‌గా ముందుకు వెళ్లాలన్నారు. గృహిణులను ఏమాత్రం తక్కువ చేసి చూడొద్దన్నారు. గృహిణులు చేసే కష్టంతోనే భావి పౌరుల జీవితాలు వికసిస్తున్నాయన్నారు. గృహిణుల కష్టాన్ని పురుషులు తరచూ చేసే ప్రయత్నం చేస్తే విలువ తెలుస్తుందన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉన్నట్లే, ప్రతి మహిళ విజయం వెనుక పురుషుడు ఉంటే సమాజానికి ఎనలేని మేలు కలుగుతుందన్నారు. మహిళలకు తండ్రి, భర్త, కుమారుడు, స్నేహితుడు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ సహకరిస్తే ఏదైనా సాధిస్తారన్నారు.
సాక్షి ఎడిషన్ కార్యాలయంలో రిపోర్టర్లు పంపిన వార్తలను పరిశీలిస్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల
Comments
Please login to add a commentAdd a comment