ఆమైపె ఆగని అకృత్యాలు
ఖలీల్‌వాడి: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమ లు చేసినా.. ‘ఆమె’పై జరుగుతోన్న అకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, మహిళలపై రో జురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నా యి. ప్రేమ పేరిట, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికలను మోసం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అత్యాచారం చేసినట్లు వెలుగుచూడడంతో పోక్సో కేసులుగా నమోదవుతున్నాయి. మరోచోట పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులను జైలుకు పంపిస్తున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోన్న విషయం.
తల్లిదండ్రుల చేతుల్లోనే బాలికల భద్రత
గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, మిఠాయిలు, తదితర బహుమతులను సున్నితంగా తిరస్కరించేలా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. ఇంటి పరిసరాలు, పాఠశాలల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా? అని అడగాలి. పిల్లలను ఇంటి పక్కవారు, బంధువులతో సినిమాలు, షాపింగ్, పర్యాటక ప్రాంతాలకు పంపించొద్దు.
కేసులు 2022 2023 2024
అత్యాచారం 62 74 77
పోక్సో 80 81 115
మహిళలపై నేరం 581 608 593
షీటీమ్ 05 01 04
సమాచారమివ్వాలి
మహిళలు, బాలికలను ఎవరైనా ఇబ్బంది పెడితే కుటుంబీకులకు చెప్పాలి. అయినా వినకపోతే పోలీసులు, డయల్ 100, షీటీమ్స్‌ల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. మారువేషంలో నిఘా పెట్టి ఆకతాయిల పనిపడతాం.
– స్రవంతి, ఎస్సై, షీటీం, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment