పేదరికాన్ని జయించి వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా..
నిజామాబాద్ సిటీ: పసిప్రాయంలోనే తండ్రి మరణం. నలుగురు తోబుట్టువులు. పూరి గుడిసెనే ఆస్తి. రాళ్లుకొడితేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే దుర్భర పరిస్థితి. మారుమూల గడ్కోల్ గ్రామం నుంచి జీవితం ప్రారంభించి వర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య బోధించే స్థాయి వరకు ఎదిగారు డాక్టర్ పిట్ల సరిత. గురుకుల పాఠశాలలో సీటు సంపాదించుకొని పదో తరగతిలో 524 మార్కులు సాధించారు. ఇంటర్‌లో 92శాతం మార్కులు వచ్చి ఎంసెట్‌లో సీటువచ్చినా ఇంజినీరింగ్ చదివే స్థోమత లేక గిరిరాజ్ కళాశాలలో డిగ్రీలో చేరారు. తెలంగాణ వర్సిటీలో ఎంఏ, ఎమ్మె స్సీ రెండు పీజీలు చేశారు. పీహెచ్‌డీ చేసి డా క్టర్ సరిత అయ్యారు. చదివిన యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పీడీఎస్‌యూలో ప నిచేసే సమయంలో ఉద్యమసహచరుడు ఎల్ బీ రవిని కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. మరోపక్క పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మానవ హక్కుల వేదిక జిల్లా ఉ పాధ్యక్షురాలిగా పేదల గొంతుకై పోరాడుతూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న డాక్టర్ పిట్ల సరిత ఆదర్శప్రాయురాలు.
Comments
Please login to add a commentAdd a comment