కరాటే క్వీన్ పల్లవి
బోధన్: ‘చిన్నప్పటి నుంచే కరాటేపై ఆసక్తి. ఇంటర్ తర్వాత పెళ్లయ్యింది. పిల్లలు, ఉద్యోగం, బాధ్యతలు పెరిగాయి. అవేమీ తన సంకల్పానికి అడ్డుకాదని భావించింది. ఎన్ని అవమానాలు, అవహేళనలు ఎదురైనా ఓర్చుకొని కరాటే క్వీన్‌గా ఎదిగారు.’ బోధన్ పట్టణానికి చెందిన మల్లెపూల పల్లవి. కరాటేతోపాటు కర్ర, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాక్సింగ్ విద్యల్లో శిక్షణ పొంది పట్టు సాధించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రతిభ చాటింది. 2022లో మార్షల్‌ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి కరాటే స్పారింగ్(ఫైటింగ్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. కరాటేలో బ్రౌన్ బెల్ట్‌స్థాయిలో నిలిచింది. సామాన్య కుటుంబానికి చెందిన వివాహిత అయిన పల్లవి కరాటే మాస్టర్‌గా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం మహిళలకు వ్యాయామ విద్య, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణనిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే లైసెన్స్ పొందిన ఏకై క మహిళా కరాటే మాస్టర్‌గా నిలిచింది. ‘ఆపద సమయంలో ఎవరో వచ్చి రక్షిస్తారని ఆశించడం కన్నా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఉత్తమం.’ అని చెబుతున్నారు కరాటే టైగర్ మల్లెపూల పల్లవి.
Comments
Please login to add a commentAdd a comment