అన్ని రంగాల్లోనూ ‘ఆమె’
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వ్యాపారం, క్రీడారంగం, యూనిఫాం ఉద్యోగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అలాగే పలువురు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణిస్తూనే మరింత మందికి ఉపాధి కల్పిస్తూ భరోసాను కల్పిస్తున్నారు. సామాజిక సేవలోనూ తమకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణించిన జిల్లా మహిళల విజయ గాథలు, మనోగతాలు, వారి సలహాలు, సూచనలు
ఇలా..
మహిళాభ్యున్నతే ధ్యేయంగా ‘కపిల మహిళా సొసైటీ’
నిజామాబాద్ సిటీ: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మగ్గిడి కళ్యాణి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. ఆమెకు తల్లితోపాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. పేదరికం కారణంగా వారు మూడుపూటల తిండి తినడం కలగానే మిగిలిపోయింది. కానీ, కళ్యాణి ఎలాగైనా తమ పేదరికాన్ని జయించాలని నిర్ణయించుకుంది. అది ప్రభుత్వ ఉద్యోగంతోనే సాధ్యమని నమ్మింది. దీంతో పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తోంది. సర్కార్ కొలువు సాధించిన కళ్యాణి పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీకి చెందిన ఉప్పరి సరిత భారతమాత మహిళ సంఘం సభ్యురాలుగా చేరింది. ఇంట్లో చపాతీలు చేసి విక్రయిస్తు చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. అలాగే అర్డర్‌పై వంటలు చేయడం ప్రారంభించింది. సంఘంలో పొదుపు నుంచి రూ. 10వేలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టింది. అలాగే సమాఖ్య నుంచి, బ్యాంకు లీకేజీ నుంచి, సీ్త్రనిధి నుంచి రుణాలు పొంది, ప్రస్తుతం కర్రీపాయింట్ దుకాణాన్ని నిర్వహిస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో వివిధ సంఘాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంది. తెలిసిన వంట ద్వారానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబంలో తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు.
ఇష్టంతో పోలీస్ ఉద్యోగం సాధించిన రాధిక
రుద్రూర్: నవీపేట్ మండలం నాళేశ్వరం గ్రామానికి చెందిన తోట రాధిక తల్లిదండ్రుల సూచన మేరకు టీచర్ ట్రైనింగ్ (డీఎడ్) పూర్తి చేసింది. కానీ చిన్నప్పటి నుంచి ఆమెకు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఆసక్తి. దీంతో ఆమెకు పెళ్లయిన తర్వాత భర్తకు, కుటుంబసభ్యులకు పోలీస్ ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని తెలియజేసింది. వారికి ఇద్దరు పిల్లలున్నా, పట్టుదలతో చదివి, హార్డ్ వర్క్ చేయడంతో పోలీస్ ఉద్యోగానికి సెలెక్టయింది. మూడు నెలల క్రితం తొలి పోస్టింగ్ రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌లో వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా ప్రతి రంగంలో మహిళలు రాణిస్తారని నిరూపించింది రాధిక.
అన్ని రంగాల్లోనూ ‘ఆమె’
అన్ని రంగాల్లోనూ ‘ఆమె’
అన్ని రంగాల్లోనూ ‘ఆమె’
Comments
Please login to add a commentAdd a comment