నందిపేట మండలంలో..
నందిపేట్ (ఆర్మూర్): మండలంలోని వెల్మల్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వెల్మల్ గ్రామానికి చెందిన కుస్తాపురం శ్రీనివాస్ తన భార్య, తండ్రితో కలిసి శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న తల్లి భోజమ్మ తలుపులకు గడియ పెట్టి ఖార్ఖానాకు వెళ్లింది. తిరిగి ఇంటికివచ్చి చూసేసరికి తలుపులు తెరిచిఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు తులాల బంగారు నగలు, వెండి సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. ఈమేరకు బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment