గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం

Published Sat, Mar 8 2025 1:42 AM | Last Updated on Sat, Mar 8 2025 1:41 AM

గోదావరి నదిలో  మహిళ మృతదేహం లభ్యం

గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం

రెంజల్‌(బోధన్‌): మండలంలోని గోదావరి నదిలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం లభించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. నదిలో మహిళ మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక జాలర్లతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలు బోధన్‌కు చెందిన శంకరమ్మ (62)గా గుర్తించినట్లు తెలిసింది. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని సమాచారం. ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందినట్లు తెలుస్తోంది.

చికిత్స పొందుతూ ఒకరి మృతి

నిజామాబాద్‌ రూరల్‌: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్‌ ఎస్సై–2 ఆనంద్‌ సాగర్‌ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. రూరల్‌ మండలంలోని కాలూర్‌ గ్రామానికి చెందిన తాడెం గంగాధర్‌(44) గత నెల 25న అప్పుల బాధ భరించలేక గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ : బాన్సువాడలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. సాయంత్రం కృష్ణానగర్‌ తండా వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగా డు. ఈ విషయాన్ని బాన్సువాడలో ఉన్న తన మేనత్తకు ఫోన్‌ చేసి చెప్పా డు. దీంతో ఆమె అక్కడికి వెళ్లి వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం శ్రీకాంత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. శ్రీకాంత్‌ బా న్సువాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈగా 2018 నుంచి పనిచేస్తున్నాడు. 2022లో షాద్‌నగర్‌కు బదిలీ అయినా.. అధికారులు డిప్యుటేషన్‌పై బాన్సువాడలోనే కొనసాగిస్తున్నారు. పని ఒత్తిడికి తోడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేంద్రకుమార్‌ పరామర్శించారు.

మట్కా నిర్వాహకుల అరెస్టు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లో మట్కా నిర్వహిస్తున్న, ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. మొత్తం ఆరుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.13వేలు, 6ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

పేకాడుతున్న నలుగురు..

సిరికొండ: మండలంలోని మైలారం గ్రామ శివారులో పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై రామ్‌ శుక్రవారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.5300 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

మహిళ అదృశ్యం

ఆర్మూర్‌టౌన్‌: మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన అల్లెపు వెంకవ్వ అనే మహిళ అదృశ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ శుక్రవారం తెలిపారు. ఈనెల 5న వెంకవ్వ భర్తతో కలిసి తన కూతురు గ్రామం జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌కు వెళ్లివస్తుండగా ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆటోలో దిగింది. ఆ తర్వాత కనబడకుండపోయింది. ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement