రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల పరిధిలోని పెద్ద గుజ్జుల్‌తండాకు చెందిన జరుపుల తుకారాం(40) తన బైక్‌పై గాంధారి నుంచి తండాకు బయలుదేరాడు. గాంధారి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మద్దెల రవి బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో ఇద్దరు కిందపడిపోయారు. తుకారాం అక్కడికక్కడే మృతి చెందగా, రవికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. వారు ఘటన స్థలనికి చేరుకొని క్షతగాత్రున్ని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఒకరు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డివైడర్‌ను ఢీకొని మృతిచెందినట్లు స్థానికులు తెలపారు. వివరాలు ఇలా.. గాంధారికి చెందిన ఒడుసుల సాయిలు(38) గురువారం రాత్రి తన బైక్‌పై వెళ్తూ మండల కేంద్రంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయాడు. దీంతో బంధువులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ఆంజనేయులును సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
బైక్‌ను ఢీకొన్న డీసీఎం: ఒకరికి తీవ్ర గాయాలు
రెంజల్(బోధన్): మండలంలోని కళ్యాపూర్ వద్ద శుక్రవారం ఓ బైక్‌ను వెనుకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై సా యన్న తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్‌లో బీడీ కమీషన్ ఏజెంట్‌గా పని చేస్తున్న సత్యనారాయణ బీడీల గంపను బైక్‌పై పెట్టుకొని నవీపేట్‌లోని కంపెనీకి బయలుదేరాడు. మార్గమధ్యలో కళ్యాపూర్ గ్రామం వద్ద అతడి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment