ఉమ్మడి జిల్లాలో దొంగల బీభత్సం
రాజంపేట: మండల కేంద్రంలోని తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇ లా.. రాజంపేటకు చెందిన మాణిక్య రాజమణి ఇంటికి తాళం వేసి బుధవారం ఊరికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం రాజమణి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో వారి ఇంటిపక్కనే నివసిస్తున్న కిరణ్ కుమార్ వారికి సమాచారం అందించాడు. వెంటనే రాజమణి ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని మూడున్నర తులాల బంగారు నెక్లెస్‌తో పాటు రూ. 10వేలు నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
నగరంలో ఆటో, బైక్..
ఖలీల్‌వాడి: నగరంలోని వేరువేరు చోట్ల రెండు వాహనాలు చోరీకి గురైనట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని గోదాంరోడ్డులో నిలిపేష్‌కుమార్ తన యాక్టీవాను ఇంటి ముందు పార్క్ చేయ గా, గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎ త్తుకెళ్లారు. అలాగే జీజీహెచ్‌లో మంగళవారం రాత్రి పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఆటో కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు చోరీ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
పలు ప్రాంతాల్లోని తాళం వేసిన
ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు
బంగారం, నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment