No Headline
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళాభ్యున్నతే ధ్యేయంగా ఇందూరులోని కపిల మహిళా సొసైటీ గత 22 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ సొసైటీ ద్వారా వేలాదిమంది మహిళలు వివిధ రకాల కోర్సులను నేర్చుకుని స్వయం ఉపాధితో నిలదొక్కుకుంటున్నారు. అయ్యవారు గోపిక అనే మహిళ 1991 నుంచి టైలరింగ్‌లో వేలమంది మహిళలకు శిక్షణ ఇస్తూ, 2003లో కపిల మహిళా సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ సొసైటీ సౌజన్యంతోపాటు నాబార్డ్, నెహ్రూ యువ కేంద్ర, ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ, స్కిల్ ఇండియాలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఎంఎస్‌ఎంఈ తదితర పథకాల కింద శిక్షణ ఇస్తున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, హ్యాండీ క్రాఫ్ట్స్, క్రిస్టల్ క్రాప్స్, చేతి కళలు, మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగులపై పెయింటింగ్(స్క్రీన్ ప్రింటింగ్), పేపర్ బ్యాగులు, గ్లాసుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, రాఖీల తయారీ, బ్యాంగిల్స్ మేకింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్నవారందరికీ సర్టిఫికెట్టు ఇస్తున్నారు. గోపిక సేవలకు గాను అనేక అవార్డులు వచ్చాయి. 2007, 2017లో గోపికకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డులు వచ్చాయి. కాగా చిన్నతరహా రుణాలు, అక్షరాస్యత, మాతాశిశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుండడంతో జిల్లాకు వచ్చిన కలెక్టర్లందరూ గోపికను ఆదర్శంగా చూపిస్తున్నారు.
No Headline
Comments
Please login to add a commentAdd a comment