బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు విస్తరించాలి ● ఎంపీ అర్వింద్ ● న
నిజామాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలకు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఇతర నెట్‌వర్క్ కన్నా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ చాలా వేగవంతంగా ఉందని అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఉపయోగిస్తున్న గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ఉపయోగించాలంటే 4జీ సేవలను మరింతగా వేగవంతం చేయాలన్నారు. టెలికాం సంస్థలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జీఎం జగ్‌రాం, టెలికాం ఉద్యోగులు జగన్, రాజ్‌కుమార్, ఆరేపల్లి నర్సయ్య, బద్దం సాయిరెడ్డి, రమణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment