కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి
కమ్మర్‌పల్లి: మండలంలోని నాగాపూర్ గ్రా మంలో కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రె లు మృత్యువాత పడ్డా యి. గ్రామంలోని బాల మల్లేష్‌కు చెందిన గొ ర్లపాకలోకి గురువారం అర్ధరాత్రి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడి చేశాయి. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలకు తీవ్ర గ్రాయాలయ్యా యి. శుక్రవారం ఉదయం పాక వద్దకు వెళ్లిన బా లమల్లేష్ మృతిచెందిన గొర్రెలను గమనించి, పంచాయతీ, పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచా రం ఇచ్చారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలమల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించాడు.
జక్రాన్‌పల్లి మండలంలో..
జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో బండారి నాగేష్‌కు చెందిన 16 గొర్రె, మేకలు కుక్కల దాడిలో మృతి చెందాయి. నాగేష్ కొట్టంలో ఉన్న గొర్రె, మేక పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment