జన్ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు
● ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ నాగారం: జన్ ఔషధి కేంద్రాల ద్వా రా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతుండడంతో వారికి ఎంతో మేలు కలుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా శుక్రవారం నాందేవ్‌వాడలో ఉన్న జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా లో మరిన్ని జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు తగిన సహాయం అందిస్తానన్నారు. నాయకులు వడ్డి మోహన్ రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, కిశోర్, కృష్ణ, బస్సాపూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment