అక్క సబ్ కలెక్టర్.. చెల్లి యాంకర్
నిజామాబాద్ సిటీ: తెలిసీ తెలియని వయస్సులోనే తండ్రి వదిలివెళ్లినా తల్లి మాత్రం మొక్కవోని దీక్షతో తనకున్న ఇద్దరు ఆడపిల్లలను చదివించింది. ఉన్నత స్థానాల్లో చూడాలనుకున్న ఆ తల్లి ఆశలను కూతుళ్లు సైతం సాకారం చేశారు. పెద్ద కుమార్తె అరుగుల స్నేహ యూపీఎస్సీ పరీక్షలల్లో విజయం సాధించారు. 2025లో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకొన్న ఆమె ప్రస్తుతం బర్గారా జిల్లా పదంపూర్ సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కకు తగ్గ చెల్లి అనిపించుకుంటోంది అరుగుల సుప్రియ. తనకు ఇష్టమైన మ్యూజిక్‌లో డిగ్రీ చేశారు. ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు బోధిస్తూ, మరో అభీష్టమైన యాంకరింగ్ చేస్తూ సంపాదిస్తున్నారు. అక్కకు ఆర్థికంగా తోడుగా నిలిచారు. తల్లి ఆశలు నెరవేర్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లు నేటి మహిళలకు ఆదర్శనీయం.
అక్క సబ్ కలెక్టర్.. చెల్లి యాంకర్
Comments
Please login to add a commentAdd a comment