స్కూల్ యూనిఫాం కుట్టేందుకు సిద్ధం కావాలి
నిజామాబాద్‌అర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికి స్కూల్ యూనిఫాం కుటేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా ఉండాలని డీఆర్డీవో సాయాగౌడ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గతేడాది లాగే ఈ సారి కూడా స్కూల్ యూనిఫాంను మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, డీపీఎం సాయిలు, సంధ్యారాణి, ఏపీఎం రాజేందర్, రిసోర్స్ పర్సన్ మాధవి, పద్మ, సుజాత, మంజుల, మాధవి తదితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment