సాక్షి నెట్‌వర్క్: జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న బోధన్, రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరైందని కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థాయిని మించి మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో బోధన్, రూరల్ ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నాయకులు పేర్కొన్నారు.
విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోగలం
నిజామాబాద్ రూరల్: విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోగలమని షీ టీమ్ ఇన్‌స్పెక్టర్ స్రవంతి అన్నారు. రూరల్ మండలం జెడ్పీహెచ్‌ఎస్ మల్లారం పాఠశాలలో షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం షీ టీం కు సంబంధించిన స్టిక్కర్లను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భూమాగౌడ్, హారతి, శ్రీకాంత్, ఫాతిమా మేరి, గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్, అరుంధతి బేగ్, అనిత సాంసన్ పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్ సిటీ: అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీటీయూ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment