మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి
ఖలీల్‌వాడి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు వక్తలు అన్నారు. జిల్లా కోర్టులోని సమావేశ హాల్‌లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి సునీత కుంచాల హాజరై మాట్లాడారు. మహిళలు ఉన్నత చదువులు చదివి శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ, ఆశా లత, శ్రీనివాస్, పద్మావతి, కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య, మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, వసంతరావు, దీపక్, పిల్లి శ్రీకాంత్, కవితారెడ్డి, నీరజ, పరిపూర్ణా రెడ్డి, రజిత, మానస, అపూర్వ, రమ, కల్పన, స్నేహ, అంజలి, న్యాయవాదులు పాల్గొన్నారు.
● మహిళలు స్వయం శక్తితో ముందుకెళ్లాలి
నిజామాబాద్‌సిటీ: మహిళలు స్వయం శక్తితో ముందుకెళ్లాలని సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మూడ్ శోభన్, బుర్రి ప్రసాద్, ఐద్వా సుజాత, పెద్ది వెంకట్ రాములు, ముక్కూర్ లావణ్, తూట్కూర్ నర్సయ్య, శిర్ప లింగం, డాక్టర్ షాబుద్దీన్, మహిళలు పాల్గొన్నారు.
● జర్నలిజం వృత్తిలో రాణించడం అభినందనీయం
నిజామాబాద్‌నాగారం: మహిళలు జర్నలిజంలో రాణించడం అభినందనీయమని డీఎంహెచ్‌వో బద్దం రాజశ్రీ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మహిళ దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం మహిళా జర్నలిస్టులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ ప్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, మహిళా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
● భారతీయ సంప్రదాయాలను గౌరవించాలి
ధర్పల్లి: ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయాలను గౌరవించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శారద, సరిత, నిహారిక సిబ్బంది పాల్గొన్నారు.
● జేసీఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
నిజామాబాద్ నాగారం: జేసీఐ ఇందూరు, జేఏసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని లక్ష్మీనర్సింహనగర్ కాలనీలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షురాలు పి గౌతమి, జైపాల్ కాలే, లావణ్య, నయన్, యాదేశ్ గౌడ్, సుకన్య, లీల, రమాదేవి, రమ్య, వీణ పాల్గొన్నారు.
● మహిళల ఆరోగ్యంపై అవగాహన
నిజామాబాద్ అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బండారు ఉషానవీన్ హాజరయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, రంగరత్నం, వెంకటరమణ, నాగజ్యోతి, నరేశ్, సుధాకర్‌రావు, రజిత, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో వక్తలు
మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి
మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి
మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి
Comments
Please login to add a commentAdd a comment