విద్యార్థుల వనసందర్శన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వనసందర్శన

Published Sat, Mar 8 2025 1:44 AM | Last Updated on Sat, Mar 8 2025 1:43 AM

విద్య

విద్యార్థుల వనసందర్శన

నిజామాబాద్‌ రూరల్‌: మోపాల్‌ మండలంలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు శుక్రవారం మంచిప్ప రిజర్వ్‌ ఫారెస్టును సందర్శించారు. ఉపాధ్యాయులు, అటవీ అధికారులు విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విజయ లలిత, రాజేశ్వరి, సురేందర్‌, రాధ, ఉద్యశీల, కిరణ్‌కుమార్‌, అటవీ శాఖ అధికారులు సాయికుమార్‌, సురేశ్‌కుమార్‌, శశిధర్‌, ప్రవీణ్‌, సంతోష్‌, రవి పాల్గొన్నారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌నాగారం: నగరంలోని కంఠేశ్వర్‌లో ఉన్న మాల సంఘ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, సభ్యులు అడిషనల్‌ కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘానికి సంబంధించిన స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా సంఘ సభ్యులపై కేసు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో వినయ్‌, బట్టి గంగాధర్‌, దయానంద్‌, సిర్పూర్‌ రాజు, శివరాజ్‌, సల్ల బాలయ్య, బొడ్డు నర్సింగ్‌ రావు, జనార్దన్‌, ప్రమోద్‌, సజన్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

ధర్పల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్‌ను సరఫరా చేస్తున్నట్లు డీఈ ఉత్తమ్‌ జాడే అ న్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్‌, సబ్‌ ఇంజినీర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు.

గెస్ట్‌ లెక్చరర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో రహస్యంగా విడుదల చేసిన అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురాం, అంజలి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెయూ రిజిస్ట్రార్‌ ఎం యాదగిరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంజయ్‌, అజయ్‌, గౌతమ్‌, విజయ్‌, దినేశ్‌ పాల్గొన్నారు.

వర్ధంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ నాయకుడు రాయల సుభాశ్‌ చంద్రబోస్‌ వర్ధంతి సభ వాల్‌ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈ నెల 9న నిర్వహించే రాయల 9వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆర్మూర్‌ డివిజన్‌ సహాయ కార్యదర్శి రమేశ్‌, సాయారెడ్డి, లింబాద్రి, రమేశ్‌, కిశోర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌..

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ను కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు సుమన్‌, నేరేళ్ల శ్రీను, సర్దార్‌, బీరేందర్‌ సింగ్‌, జి చైతన్య కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలి

నిజామాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు ప్రాణాళిక బద్ధంగా చదవాలని డీఈవో అశోక్‌ అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ గార్డెన్‌ గార్డెన్‌లో నిర్వహించిన సెయింట్‌ జేవియర్‌ పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ నరసింహరావు, లతాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలిండియా పోలీస్‌ గేమ్స్‌కు వెంకటేశ్‌ ఎంపిక

జక్రాన్‌పల్లి: మండలంలోని కలిగోట్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా పోలీస్‌ గేమ్స్‌కి ఎంపికయ్యారు. త్వరలో హర్యాణాలో నిర్వహించే జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో వెంకటేశ్‌ పాల్గొననున్నారు. వెంకటేశ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అతని ఎంపికపై పాఠశాల పీడీలు యాదగిరి, మధు హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థుల వనసందర్శన 
1
1/2

విద్యార్థుల వనసందర్శన

విద్యార్థుల వనసందర్శన 
2
2/2

విద్యార్థుల వనసందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement