● అన్ని రంగాల్లోనూ
సత్తాచాటుతున్న అతివలు
● రక్షణ కవచాలుగా అనేక చట్టాలు
● నేడు అంతర్జాతీయ మహిళా
దినోత్సవం
తాను అబల కాదు.. సబల, సాహసి అని నిరూపిస్తున్నది మహిళ. కష్టాలను భరిస్తూ, వేధింపులను ధైర్యంగా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. అవసరమైతే కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేలవైపు తలవాల్చి నడవడం కాదు, నింగికి నిచ్చెన వేస్తున్నది. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై నడుస్తున్నది. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. జగతిలో తాను లేని చోట లేదని రుజువు చేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను, అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment