ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలను సరిచేయాలి
డిచ్‌పల్లి: ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలు ఉన్నాయని వాటిని సరి చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్రనాయకుడు గంథమాల నాగభూషణం డిమాండ్ చేశారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జి డప్పు నర్సయ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ మాదిగల ఆత్మగౌరవ డప్పుల ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిష్టయ్య, యమున, సత్తెక్క, సాయిలు, సురేశ్, పోషన్న, బక్కన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment