లైబ్రరీలోని సాహిత్య సంపద | - | Sakshi
Sakshi News home page

లైబ్రరీలోని సాహిత్య సంపద

Published Sun, Mar 9 2025 1:31 AM | Last Updated on Sun, Mar 9 2025 1:30 AM

లైబ్ర

లైబ్రరీలోని సాహిత్య సంపద

పుస్తకాలను పరిశీలిస్తున్న ఔత్సాహిక విద్యార్థులు

నిజామాబాద్‌ సిటీ : ఆ ఇంటి నుంచి వచ్చే సాహిత్య పరిమళాల సువాసన ఎన్నో మెదళ్లను కదిలిస్తోంది. తెలుగు పాఠాలు బోధించే పంతులు కవిగా, రచయితగా, గ్రంథకర్తగా రాణిస్తూ సాహిత్య లోకానికి తన సేవలందిస్తున్నారు. ఆయన పేరే డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు. ప్రస్తుతం సిర్పూర్‌ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తన ఇంటి పైఅంతస్తును గ్రంథాలయంగా మార్చారు. 35 ఏళ్ల క్రితం పుస్తకాలు సేకరించడం ప్రారంభించిన ఆయ న 15 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు.

సాహిత్య దాహార్తిని తీరుస్తున్న లైబ్రరీ

తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తల గ్రంథాలు, కావ్యాలు, పద్య కావ్యాలు, ప్రాచీన సాహిత్యం, శాసనాలు, ఆధునిక సాహిత్యం, కవితలు, కథలు, నవలలు, నాటికలు, బాలల పుస్తకాలు, జీవిత చరిత్రలు వంటి ఎన్నో నాటకాలు, ఎన్నెన్నో పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. ఈ సాహితీ సంపద భావి పరిశోధకులు, ఔత్సాహిక విద్యార్థులు, రచయితలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ గ్రంథాలయాన్ని ప్రతిరోజూ సాహిత్య అభి మానులు, సాహిత్య పరిశోధకులు, కవులు, కవి త్వం నేర్చుకోవాలనుకునే యువతరం సందర్శించి వారి సాహిత్య దాహార్తిని తీర్చుకుంటున్నారు. తెలుగు పరిశోధకులు తెలంగాణ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ, శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులు తమకు కావాల్సిన సాహిత్య సమాచారాన్ని పొందుతున్నారు. నరేశ్‌రావు ఏర్పాటు చేసిన గ్రంథాలయంలోని పుస్తకాల సహకారంతో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు తమ పరిశోధక వ్యాసాలను పూర్తిచేశారు.

35 ఏళ్లుగా..

జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్‌ కాలనీలో నివాసముండే డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు సిర్పూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కవితలు, కథలు, వ్యాసరచనల్లో తర్ఫీదునిస్తున్నారు. గుండారం గువ్వలు, సిరిపురం సిరులు వంటి పుస్తకాలు ప్రచురించారు. ఆయన విద్యార్థులు రాసిన కవితలకు జాతీయ బహుమతులు దక్కాయి. 35 ఏళ్ల క్రితం నుంచి పుస్తకాలు సేకరించే పనిలో పడిన నరేశ్‌రావు.. ఇప్పటివరకు దాదాపు 15 వేలకు పైగా పుస్తకాలు సేకరించారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన కీర్తిని గడించిన పుస్తకాలు ఆయన లైబ్రరీలో కొలువుదీరి ఉన్నాయి.

రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్‌ బాల శ్రీ నివాసమూర్తి, డాక్టర్‌ త్రివేణి, డాక్టర్‌ ఫణీంద్ర, డాక్ట ర్‌ మేకల రామస్వామి, బోయిన్‌పల్లి ప్రభాకర్‌, కవు లు వీపీ చందన్‌రావు, పంచరెడ్డి లక్ష్మణ్‌, ఘనపురం దేవేందర్‌, గంట్యాల ప్రసాద్‌, డాక్టర్‌ శారద హ న్మాండ్లు, చింతల శ్రీనివాస్‌గుప్తా గ్రంథాలయాన్ని సందర్శించారు. డాక్టర్‌ వారె దస్తగిరి, డాక్టర్‌ శశికు మార్‌, డాక్టర్‌ సుంకరి గంగాధర్‌, డాక్టర్‌ అన్నం దా స్‌ జ్యోతి, డాక్టర్‌ ఎం రామస్వామి, కందకుర్తి ఆనంద్‌ సిద్దసాయిరెడ్డి తదితరులు తమ పరిశోధనలు పూర్తిచేశారు.

ప్రబంధాలు

16వ శతాబ్దంలో వచ్చిన వసుచరిత్ర, మను చరిత్ర, ఆముక్తమాల్యద, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, పాండురంగ మహత్యం, రాజశేఖర చరిత, పారిజాతాపహరణం.

ఆధునిక సాహిత్యం

గురజాడ అప్పారావు తెలుగులో రచించిన మొదటి కథ దిద్దుబాటు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు, చాసోకథలు, విశ్వనాథ సత్యనారాయణ కథలు, అడవి బాపిరాజు కథలు, కేతు విశ్వనాథరెడ్డి, కాళీపట్నం రామారావు కథలు.. ఇంకా ఎన్నో..

పరిశోధన గ్రంథాలు

బీఎన్‌రెడ్డికి చెందిన తెలుగులో శాసననాలు, బిరుదరాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యం, సినారె ఆధునిక కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు, డాక్టర్‌ కొట్టూరు ముత్యం రచించిన శ్రీకాకుళ ఉద్యమంలో తెలుగు సాహిత్య ప్రభావం, నిజామాబాద్‌ జిల్లా శాస్త్రాలు, బాచన్‌పల్లి ఒక గుట్టకిందపల్లి వంటివి.

జీవిత చరిత్రలు

కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర మొదలుకొని ఇటీవల వచ్చిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అమరేశ్వర రాజేశ్వర శర్మ, నేను చిందు ఎల్లమ్మను (జిల్లాకు చెందిన చిందు కళాకారిణి).

ఆత్మకథలు

మళ్లీ మొదలు, గుఱ్ణం జాషువా, దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథలు

శ్రీపాద సుబ్రహ్మణ్యం ఆత్మకథ, కాళోజీ ఆత్మకథ ‘ఇది నాగొడవ’, నేను చిందు ఎల్లమ్మను.

నవలలు

తెలుగులో కందుకూరి వీరేశలింగం రాసిన మొదటి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర మొదలుకొని విశ్వనాథ సత్యనారాయణ నవలలు, గుడిపాటి వెంకటాచలం నవలలు, డాక్టర్‌ కేశవరెడ్డి నవలలు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన వేయి పడగలు.

కవిత్వం

శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలుకొని దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ రాసిన అమృతం కురిసిన రాత్రి, గుంటూరు శేషేంద్ర శర్మ (ఆధునిక మహాభారతం), సినారే రచించిన విశ్వంభర, శివారెడ్డి కవిత్వం తదితరాలు.

చరిత్ర పుస్తకాలు

తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, సంస్కృత సాహిత్య చరిత్ర, సూర్యరాయాంధ్ర నిఘంటువులు (14 సంపుటాలు), వ్యాకరణశాస్త్ర గ్రంథాలు తదితరాలున్నాయి.

జిల్లాకు చెందిన సమగ్ర సాహిత్యం

నిజామాబాద్‌ జిల్లా సంపూర్ణసాహిత్య పుస్తకాలు.

ప్రత్యేక సంచికలు (సావనీర్‌లు)

ఇందూరు ఉత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు, శతాబ్ది ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు, తదితర ప్రత్యేక సంచికలు.

ఆ ఇల్లే ఓ గ్రంథాలయం

లైబ్రరీ కోసం ఇంటిపై

ప్రత్యేక అంతస్తు నిర్మాణం

15 వేలకు పైగా పుస్తకాల సేకరణ

సాహిత్యకారులు, పరిశోధక

విద్యార్థులకోసం అందుబాటులో..

అక్కడే కూర్చుని చదువుకునేందుకు

వసతుల ఏర్పాటు

సాహిత్య సేవలో తరిస్తున్న

తెలుగు టీచర్‌ డాక్టర్‌ కాసర్ల

No comments yet. Be the first to comment!
Add a comment
లైబ్రరీలోని సాహిత్య సంపద1
1/2

లైబ్రరీలోని సాహిత్య సంపద

లైబ్రరీలోని సాహిత్య సంపద2
2/2

లైబ్రరీలోని సాహిత్య సంపద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement