కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకుని 16 నెలలు పూర్తవుతున్నప్పటికీ తమకు ప్రాధాన్యత దక్కడం లేదని జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తమకు అన్యాయం జరుగుతోందని గుర్రుగా ఉన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం పనిచేసినప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని అత్యధికమంది కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. పైగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా వ్యవహరించిన వాళ్లను అధికారం వచ్చాక కాంగ్రెస్‌లోకి తీసుకోవడమే కాకుండా, వాళ్లకే ప్రాధాన్యత ఇచ్చి తమకు మాత్రం ఇవ్వడంలేదని అంటున్నారు. అధికారులు సైతం బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ తమకు సహకరించడంలేదని ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు కొందరికే నామినేటెడ్ పదవులు ఇచ్చి తమకు ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారని పార్టీలో ఏళ్లతరబడి పనిచేస్తున్న సీనియర్లు వాపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన మరొకరికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల కూడా సీనియర్లు అసహనంగా ఉన్నారు.
సీఎం ప్రచారం చేసినా..
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో రోజురోజుకూ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం గెలుచుకుంది. జిల్లాలో మున్సిపాలిటీలు, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ నాయకత్వం పకడ్బందీగా పావులు కదుపుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుకు రెండు స్థానాలను గెలుపొందిన బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. ఓటమి భారంతో కాంగ్రెస్‌లో నిరుత్సాహం నెలకొంది.
స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో
నీరుగారుతున్న ఉత్సాహం
నామినేటెడ్ పదవులు రాక
గుర్రుమంటున్న సీనియర్లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో మరింత నిస్తేజం
అనవసర జాప్యం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నే గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తయింది. తరువాత మండల, జిల్లా ప్రజా పరిషత్ పా లకవర్గాల పదవీకాలం, మూడు నెలల క్రితం మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోయింది. అయితే సహకార సంఘాలకు ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగించారు. ప్రభు త్వం పట్ల అంతగా వ్యతిరేకత రాకముందే పాలకవర్గాల కాలపరిమితి పూర్తయిన స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహిస్తే సానుకూల ఫలితాలు సాధించే అవకాశాలు ఉండేవన్నారు. అనవసర తాత్సారం చేసి వ్యతిరేక పవనాలు వచ్చేవరకు చేశారని, దీంతో ఉత్సాహం నీరుగారిపోతోంద ని పార్టీ శ్రేణులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా బాధ్యతలన్నీ అధికారులకు అప్పగించడంతో తమకు విలువ లే కుండా పోతోందని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment