నర్సింగ్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన
ఎడపల్లి(బోధన్): ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ఏర్పాటు కోసం మండలంలోని అంబం గేట్ వద్ద ఎన్‌ఎస్‌ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శనివారం పరిశీలించారు. రోడ్డు, రవాణా వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని స్థానిక అధికారులకు సూచించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, తహసీల్దార్ విఠల్, అధికారులు ఉన్నారు.
పసుపు రైతులకు నష్టం చేస్తే ఊరుకోబోం
మోర్తాడ్(బాల్కొండ): పసుపు ధరల విషయంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం, వ్యాపారులు సిండికేట్‌గా మా రి రైతులకు నష్టం కలిగిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు. మోర్తాడ్ మండలం పాలెంలో శనివారం పర్యటించిన ఆయన.. రైతులతో పసుపు ధరపై చర్చించారు. మార్కెట్ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్‌లో మా ట్లాడారు. పసుపునకు కటాఫ్ ధరను రూ.9వేల నుంచి రూ.8వేలకు తగ్గించారని, కొమ్ముకు రూ.10వేలు, మండకు రూ.9వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటు పేరుకే ఉందని, బోర్డు ఏర్పడితే రూ.15వేల మద్దతు ధరను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన కు గురికావొద్దని, అండగా ఉంటామన్నారు.
సిఖ్ సొసైటీ సేవలు ప్రశంసనీయం
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సిఖ్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఉమెన్ డెవలప్‌మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించగా, సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తేజ్‌దీప్ కౌర్ పాల్గొన్నారు. అనంతరం పాములబస్తీలోని గురుద్వారా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనాల్లో వారు పాల్గొన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఉమెన్ డెవలప్‌మెంట్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. గురుద్వారాకు ఆనుకుని రేకుల షెడ్లలో నివాసాలు ఉంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని రిటైర్డ్ డీజీపీ కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సొసైటీ ప్రతినిధులు దర్శన్‌సింగ్, మహేందర్‌సింగ్, దీప్‌సింగ్, నరేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చిరుత సంచారం
ఎడపల్లి(బోధన్): చిరుతపులి మళ్లీ సంచరిస్తోంది. జాన్కంపేట్ శివారులో రైస్‌మిల్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల కోసం గు రువారం తవ్వకాలు చేపట్టారు. అదే సమ యంలో వచ్చిన చిరుత అరగంట వరకు అక్కడే కూర్చుంది. జేసీబీ డ్రైవర్ భయాందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నెల రోజులుగా చిరుత సంచరిస్తోందని తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగ్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment