సుదర్శన్‌రెడ్డి వల్లే నవోదయ రిజెక్టు
సుభాష్‌నగర్: నవోదయకు నిజాంషుగర్స్ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాల భూమిని ప్రతిపాదించడంతో రిజెక్ట్ అయ్యిందని, విద్యాలయ ఏర్పాటు ప్రక్రియ ఆరు నెలలు వెనుకబడిందని ఎంపీ అర్వింద్ ధర్మపు రి అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ నగరంలోని బీజే పీ కార్యాలయంలో శనివారం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బా ల్కొండ నియోజకవర్గాలకు అనువుగా ఉంటుందని కలిగోట్ శివారును నవోదయ విద్యాలయానికి ఎంపిక చేశామన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నవోదయకు స్థలాల ను త్వరగా క్లియర్ చేయాలని కోరగా ఆయన అధి కారులకు ఆదేశాలిచ్చారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటుకు తమ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని ఒప్పిస్తే.. మరో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించా రు. సుమారు రూ.100 కోట్లతో చేపట్టే నవోదయకు నిజాంషుగర్స్‌కు చెందిన ప్రయివేటు భూమిని ఎలా ప్రతిపాదిస్తారని నిలదీశారు. కాబోయే మంత్రికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం సుదర్శన్‌రెడ్డికి లేదన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌ని తెరిపించే ఉద్దేశం సుదర్శన్‌రెడ్డికి లేదా అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకునే ఆలోచనలో ఆయన ఉన్నారని, ఇంకా నిజాంషుగర్స్‌ను ఏం తెరిపిస్తారని ఆరోపించారు. దీనిపై రైతు సంఘాలు ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. ఇదిలా ఉండగా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఓఎల్‌ఎస్ సర్వే చేసి పంపిస్తే పనులు ప్రారంభమవుతాయని అర్వింద్ సూచించారు. ఈ సర్వేకు, నవోదయ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయాలన్నారు. రెండు పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతే భూపతిరెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. నవోదయ రిజెక్ట్ విషయమై ఇప్పటికే సీఎంకు లేఖ రాశానని అర్వింద్ ప్రతిని విడుదలచేశారు. ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, నాయకులు మోహన్‌రెడ్డి, స్రవంతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యంతో ముందుకెళ్తున్నా..
పదేళ్లల్లో పది ఫ్లై ఓవర్లు కట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని అర్వింద్ పేర్కొన్నారు. ఈనెలాఖరుకు మామిడిపల్లి, అడవి మామిడిపల్లి ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తామని, ఈ ఏడాది ఆఖరు వరకు మాధవనగర్, అర్సపల్లి ఫ్లై ఓవర్ల పనులు పూర్తవుతాయన్నారు. బీజేపీకి రెండు ఎమ్మెల్సీలు దక్కడం కార్యకర్తల విజయమని, స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుస్తా మన్నారు. జిల్లా కేంద్రంలో ఎంఐ ఎం వర్సెస్ బీజేపీ ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు చేస్తే తప్పేందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధామిచ్చారు.
ఎన్‌ఎస్‌ఎఫ్ భూమి ఎలా ప్రతిపాదిస్తారు ?
ఎంపీ అర్వింద్ ధర్మపురి
Comments
Please login to add a commentAdd a comment