చేపలవేటకు వెళ్లి యువకుడి మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నదిలో చేపలవేటకు వెళ్లి చీనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఉస్మాన్(27) మృతి చెందాడు. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని మంజీరా నదిలో చేపల వేటకు ఉస్మాన్ శుక్రవారం వెళ్లాడు. రాత్రి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం నది ఒడ్డున ఉస్మాన్‌కు సంబంధించిన వస్తువులు కనిపించడంతో కుటుంబసభ్యులు నీటిలో గాలించగా మృతదేహాం లభ్యమైంది. మృతుడి భార్య అమీదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన అచ్చనపల్లి సాయిక్రిష్ణ(21) హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. డబ్బుల విషయంలో తల్లి సాయమ్మ మందలించిందనే కారణంతో సాయిక్రిష్ణ గత నెల 21న ఇంట్లో ఉన్న పురుగులమందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికి త్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు గురువారం సాయిక్రిష్ణను గాంధీ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.
చేపలవేటకు వెళ్లి యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment