వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
ఎడపల్లి (బోధన్): ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామానికి చెందిన సురేశ్(24) శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వంశీచందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో సురేశ్ శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. శనివారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జీవితం మీద విరక్తితో..
పిట్లం(జుక్కల్): మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో శనివారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజు తెలిపారు. రుద్రూర్ గ్రామానికి చెందిన జిల్లాపురం చిన్న సాయిలు(48) కొంతకాలం నుంచి మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతుండేవాడు. జీవితంపై విరక్తితో బొల్లక్‌పల్లి గ్రామశివారులోని మంజీర బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment