
నిజామాబాద్ బస్టాండ్‌లో గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుమా రు 250 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందం బస్టాండ్ వద్దకు వెళ్లగా అ నుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో 250 గ్రాముల ఎండు గంజాయి ఉందన్నారు. అతడిని వి చారించగా నవీపేట్ మండలం నాళేశ్వర్‌కు చెందిన బీస ప్రవీణ్(29)గా గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎలవాత్ గ్రామంలో ఉంటున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి పట్టివేతలో కీలకపాత్ర పోషించిన ఎస్సై మొగులయ్య, సిబ్బందిని అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment