
కొత్త వేతనాలు వచ్చేదెప్పుడు?
మోర్తాడ్(బాల్కొండ): మినీ అంగన్‌వాడీల నుంచి మెయిన్ అంగన్‌వాడీలుగా గుర్తింపు పొందినా పాతవేతనాలు మంజూరుకావడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచినా తమకు కొత్త వేతనాలు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 135 మంది సిబ్బంది..
జిల్లాలో 135 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలోనే ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఆర్థికశాఖ ఆమోదం లభించకపోవడంతో అప్‌గ్రేడ్ చేయబడిన అంగన్‌వాడీ కార్యకర్తలకు కొత్త వేతనానికి బదులు, పాత వేతనమే అందుతుంది. మినీ అంగన్‌వాడీలకు మొదట్లో నెలకు రూ.7,500ల చొప్పున వేతనం లభించేది. అప్‌గ్రేడ్ చేయడంతో వారికి ప్రతి నెలా రూ.15వేల వేతనం అందాల్సి ఉంది. అప్‌గ్రేడ్ చేసిన తొలినాళ్లలో రెండు నెలల పాటు కొత్త వేతనం అందించారు. సాంకేతిక కారణాలతో ఆర్థికశాఖ ఆమోదం లభించలేదని ఏప్రిల్ 2024 నుంచి పాత వేతనమే అందిస్తున్నారు. ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనైనా ఒకే విధమైన పని భారం ఉందని ఒక చోట తక్కువ మరో చోట ఎక్కువ అనే తేడా ఏమి లేదని కార్యకర్తలు చెబుతున్నారు. వేతనం విషయంలోనే ప్రభుత్వం దోబూచులాడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నిమార్లు విన్నవించినా..
అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు, ఆర్థిక శాఖకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తమ శాఖ విధులే కా కుండా ప్రభుత్వం సూచించిన ఎలాంటి పనినైనా ఎంతో బాధ్యతతో చేస్తున్న తమ పట్ల ఎవరూ కనికరం చూపడం లేదని అప్‌గ్రేడ్ చేయబడిన అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మెయిన్ అంగన్‌వాడీలుగా
మినీ అంగన్‌వాడీ కార్యకర్తల గుర్తింపు
2024లోనే ఉత్తర్వులు జారీ
అయినా సిబ్బందికి
పాతవేతనాలే మంజూరు
ప్రభుత్వం స్పందించాలి..
అప్‌గ్రేడ్ చేయబడిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని ఎన్నోమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. మహిళా దినోత్సవం సందర్బంగానైనా ప్రభుత్వం స్పందించి, అంగన్‌వాడీ కార్యకర్తలకు శుభవార్తను అందించేలా చొరవ తీసుకోవాలి.
–కై రి దేవగంగు, అంగన్‌వాడీ వర్కర్స్
అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment