
47ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు
భిక్కనూరు: చిన్ననాటి మిత్రులందరూ దాదాపు 47ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1977–78 ఎస్సెస్సీ బ్యాచ్ బి సెక్షన్ విద్యార్థులు ఆదివారం భిక్కనూరు
మండలంలోని బీటీఎస్ చౌరస్తా వద్ద పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంతో చిన్ననాటి తీపీ గుర్తులను నెమరువేసుకున్నారు. ప్రతి ఏడాది ఇలానే కలుసుకోవాలని, స్నేహితుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో ఆనాటి పూర్వ విద్యార్థులు శ్రీధర్, భూమయ్య, సునీల్‌కుమార్, చాట్ల రాజేశ్వర్, పాత బాల్‌కిషన్, రామలింగం, పార్శి మధుసూధన్, వెంకటరమణ, కస్వ వెంకటేశం, ముప్పారపు రాజేందర్, బీమ్‌రావు, గోజే రాజేందర్, రమేష్, చిట్టిమధు, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.
38ఏళ్ల తర్వాత..
భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ 1986–87 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. బస్వాపూర్ గ్రామంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాటి విద్యార్థులందరూ హాజరయ్యారు. సుమారు 38ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. తమతో చదువుకుని స్వర్గస్తులైన నలుగురు స్నేహితుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆనాటి గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మానించారు.

47ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు
Comments
Please login to add a commentAdd a comment